close

తాజా వార్తలు

రాజస్థాన్‌లో మరో సామూహిక అత్యాచార ఘటన

బికనేర్: రాజస్థాన్‌లో అల్వార్‌ సామూహిక అత్యాచార ఘటనను మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. వంటసరుకు తెచ్చుకోవడానికి వెళ్లిన ఓ గృహిణిని ముగ్గురు కామాంధులు అత్యాచారం చేసిన ఘటన బికనేర్‌లో వెలుగుచూసింది. మే 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు తెలిసింది. ఈ విషయంపై ఛతార్‌గడ్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జ్‌ సందీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. శనివారం ఉదయం తెల్లవారుజామున అత్యాచారానికి గురైన బాధిత మహిళ, ఆమె భర్త ఫిర్యాదు చేశారని తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపించామని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులు ఆరిఫ్‌, దినేశ్‌, భన్వారీలను అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు. కాగా, తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకే తెల్లవారుజామున ఫిర్యాదు ఇస్తున్నట్లు బాధిత మహిళ పేర్కొంది.
ఇటీవలే
థానాగజి ప్రాంతంలో ఓ మహిళపై ముగ్గురు దుండగులు అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏప్రిల్‌ 26న జరిగిన ఆ ఘటనపై రాజస్థాన్‌ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ఎన్నికల ప్రచారంలో సైతం ఈ కేసును ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్రమోదీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.
ఓ దళిత మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళుతుండగా.. మరో రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు వారిని అడ్డగించారు. భర్తను దారుణంగా కొట్టి, కట్టేసి మహిళను సమీపంలోని పొలాల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు అలసత్వం ప్రదర్శించారని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కాంగ్రెస్‌ ఈ కేసును మూసివేయించేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనలో బాధిత మహిళ భర్త మాట్లాడుతూ ఏప్రిల్‌ 30న ఫిర్యాదు చేసినా మే 2 వరకూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని వాపోయారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.