
తాజా వార్తలు
చెన్నై : ఎగ్జిట్‌పోల్ ఫలితాలపై డీఎంకే ఎంతమాత్రం బాధపడటంలేదని ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్‌పై స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మూడు రోజుల్లో ప్రజాతీర్పు తెలుస్తుంది. అందుకోసం మేం ఎదురుచూస్తున్నాం. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై డీఎంకే ఎంతమాత్రం బాధపడటం లేదు. అది అనుకూలమైనా..వ్యతిరేకమైనా’ అని అన్నారు. ఏడుదశల పోలింగ్ ముగియగానే దాదాపు అన్ని సర్వేసంస్థలు తమిళనాడులో మెజారీటీ స్థానాలు డీఎంకేకు దక్కుతాయని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా కేంద్రంలో అధికారం చేపట్టే ఏ కూటమిలోనైనా సరే డీఎంకే భాగస్వామిగా ఉంటుందా అని విలేకరులు ప్రశ్నించగా.. దానికి ‘మే23న ఓట్ల లెక్కింపు జరిగిన తరువాత వివరణ ఇస్తామని’ స్టాలిన్ పేర్కొన్నారు.
Tags :