close

తాజా వార్తలు

రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య

కడప నేరవిభాగం: తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని తీవ్ర మనస్థాపం చెందిన ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కడప శివారులోని గంగాయపల్లె సమీపంలోని రైల్వే ట్రాక్‌పై సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురం జిల్లా కేంద్రంలోని 1వ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జి.రమేష్ బాబు ‌(30), అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఈ నేపథ్యంలో రమేష్‌ కుటుంబ సభ్యులు వేరే అమ్మాయితో అతనికి జూన్‌ మొదటి వారంలో వివాహం నిశ్చయించారు. తమ ప్రేమను అంగీకరించకుండా పెద్దలు తీసుకున్న నిర్ణయానికి తీవ్ర మనస్థాపం చెందిన ప్రేమ జంట ఈ దారుణానికి పాల్పడిందని రైల్వే పోలీసులు తెలిపారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు పేర్కొన్నారు.
 

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.