close

తాజా వార్తలు

ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం 

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని కుల్‌గామ్‌ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ‘హిజ్బుల్‌ ముజాహిదీన్(హెచ్‌ఎమ్‌)‌’కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు బుధవారం ఉదయం హతమైనట్లు పోలీసులు తెలిపారు. గోపాల్‌పొర ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించిన సమాచారం అందడంతో భద్రతాదళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో నిర్భంధ తనిఖీలు కొనసాగిస్తున్న సమయంలో సమీపంలోనే నక్కి ఉన్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతంలో తాత్కాలికంగా మొబైల్‌, అంతర్జాల సేవల్ని నిలిపివేశారు. 

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.