close

తాజా వార్తలు

యుద్ధ విమానంతో భావనాకాంత్‌

ఆసక్తితో వైమానిక రంగంలోకి వచ్చిన ఆమె... ఇప్పుడు అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. శిక్షణలో భాగంగా మిగ్‌-21 బైసన్‌ విమానాన్ని పగటిపూట విజయవంతంగా నడిపింది. దీంతో  యుద్ధవిమానంలో పోరాట ఆపరేషన్లు చేపట్టేందుకు అర్హత సాధించిన తొలి మహిళా ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌గా చరిత్రలో నిలిచింది. ఆమే భావనాకాంత్‌.

భారత వైమానిక దళం...  2017లో తొలిసారి ఫ్లైట్‌ లెఫ్టినెంట్లుగా మహిళలను ఎంపిక చేసింది. ఆ మొదటి బ్యాచ్‌లోనే భావనా కాంత్‌ అర్హత సాధించింది. ఇక్కడ శిక్షణ ముగిసిన అనంతరం 2017లో ఫైటర్‌ స్క్వాడ్రన్‌గా చేరి, ఏడాదిలోపే ఒంటరిగా మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానాన్ని నడిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. టెక్నికల్‌ ఫ్లైయింగ్‌తోపాటు, యుద్ధభూమిలో విమానం నడపడంలోనూ శిక్షణ పూర్తి చేసిందామె. పగటిపూట మాత్రమే కాకుండా, రాత్రి వేళల్లో కూడా యుద్ధ విమానాన్ని అవలీలగా నడిపే సామర్థ్యాన్ని నేర్చుకుంది. దీంతో త్వరలో ‘ఆపరేషనల్‌ ఇన్‌ ద మూన్‌ ఫేజ్‌’తోపాటు ‘డార్క్‌ ఫేజ్‌’ పేరుతో శిక్షణ తీసుకోనుంది. అంటే... పగలూరాత్రితో సంబంధం లేకుండా అన్నివేళలా యుద్ధ విమానాన్ని నడిపే అర్హతను ఈ శిక్షణ ద్వారా పూర్తిస్థాయిలో పొందనుంది. ‘విధుల పట్ల అంకిత భావం, లక్ష్యం కోసం ఆమె చేసిన కృషి అభినందనీయం’ అంటూ ఐఏఎఫ్‌ అధికారులు భావనను అభినందించారు.

* బిహార్‌, దర్భాంగకు చెందిన భావనాకాంత్‌ బెగుసరైలో ప్రాథ]మిక విద్యను ముగించింది. ఆ తరువాత బెంగళూరులోని బీఎమ్మెస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో మెడికల్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, భారత వైమానిక దళంలో చేరింది. ప్రస్తుతం రాజస్థాన్‌, నల్‌ వద్ద ఫ్రంట్‌లైన్‌ వైమానిక కేంద్రంలో తన స్క్వాడ్రన్‌తో కలిసి ఎయిర్‌క్రాఫ్ట్‌ బాధ్యతలను నిర్వర్తిస్తోంది.


దేశం కోసం పోరాడతా...

శిక్షణ ముగిసిన తరువాత పగటిపూట ముద్ధవిమానాన్ని ప్రయోగాత్మకంగా నడిపే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో అత్యంత విలువైన, అతి పెద్ద విజయంగా భావిస్తున్నా.  అయితే ఇది ప్రారంభం మాత్రమే. ఫైటర్‌ ఫెలట్‌గా విధులు నిర్వహించాలనేదే నా లక్ష్యం. అదే చేయబోతున్నా. అలాగే దేశం కోసం పోరాడతా. అమ్మానాన్న నన్ను చూసి గర్వపడేలా చేస్తా.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.