close

తాజా వార్తలు

విజయవాడ పాతబస్తీలో సైకో హల్‌చల్‌

విజయవాడ వన్‌టౌన్‌: విజయవాడ వన్‌టౌన్‌ పరిధిలోని పాతబస్తీ పంజా సెంటర్‌లో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. చేతిలో కర్ర, పగిలిపోయిన బీరుసీసా పట్టుకొని స్థానికులపై దాడిచేస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో అక్కడ గుమిగూడిన స్థానికులు ఆ వ్యక్తిని పట్టుకొనేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తి ఓ యువకుడిని కర్రతో కొట్టి అక్కడి నుంచి పారిపోయి బీఆర్‌పీ-కొత్తపేట రోడ్డులోని జనసేన కార్యాలయానికి ఎదురుగా ఉన్న మురుగు కాల్వలో దాక్కున్నాడు. సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ ఎండీ ఉమర్‌, ఎస్ఐ సుబ్రహ్మణ్యం సంఘటన స్థలానికి చేరుకొని మున్సిపల్‌ సిబ్బంది సాయంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సదరు వ్యక్తిని ప్రాథమిక చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.