close

తాజా వార్తలు

ఆకాశ్‌-1ఎస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

భువనేశ్వర్‌: భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ఆకాశ్‌ -1ఎస్‌ క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌ తీరం నుంచి దీనిని ప్రయోగించింది. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం గల ఈ క్షిపణిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవోను రూపొందించింది. భూ ఉపరితలం నుంచి 18 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శత్రు దేశాల యుద్ధ విమానాలు, క్రూయీజ్‌ క్షిపణులు, బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లను ఆకాశ్‌- 1ఎస్‌ సమర్థంగా కూల్చేయగలదు. కాగా, రెండు రోజుల వ్యవధిలో ఈ క్షిపణిని రెండు సార్లు విజయవంతంగా ప్రయోగించినట్లు డీఆర్‌డీవో వెల్లడించింది. ఆకాశ్‌-1ఎస్‌ క్షిపణిని మే 25, 27న పరీక్షించినట్లు తెలిపింది. 

ఇదిలా ఉండగా.. గత శుక్రవారం రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ఓ గైడెడ్‌ బాంబును డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. దేశీయంగా తయారు చేసిన ఈ 500 కేజీల ఇనెర్షియల్‌ గైడెడ్‌ బాంబును వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించారు. చాలా కచ్చితత్వంతో ఇది లక్ష్యాన్ని తాకినట్లు డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు.         

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.