close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/05/2019 00:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐటీఐ అభ్యర్థులకు డీఆర్‌డీవో ఆహ్వానం 

351 టెక్నీషియన్‌ పోస్టులకు ప్రకటన విడుదల

కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తాజాగా 351 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. రెండు దశల్లో నిర్వహించే పరీక్షల ద్వారా నియామకాలు చేపడతారు. ఐటీఐ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఎంపికైనవారికి నెలకు సుమారు రూ.28 వేల వేతనం అందుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్‌ 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
రెండు దశల్లో నిర్వహించే పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఇప్పుడొచ్చింది. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ /  నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌/ అప్రెంటిస్‌షిప్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 18-28 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులవుతారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

విభాగాలు: ఆటోమొబైల్‌, బుక్‌ బైండర్‌, కార్పెంటర్‌, కోపా, డ్రాఫ్ట్స్‌మెన్‌ మెకానికల్‌, డీటీపీ ఆపరేటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్స్‌,  ఫిట్టర్‌,  మెషినిస్ట్‌,  డీజిల్‌ మెకానిక్‌,  మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, మోటార్‌ మెకానిక్‌, పెయింటర్‌, ఫొటోగ్రాఫర్‌, షీట్‌ మెటల్‌ వర్క్‌, టర్నర్‌, వెల్డర్‌. 
పరీక్షను రెండు దశల్లో నిర్వహించి, ఉద్యోగాలకు తగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

టైర్‌-1: ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో జనరల్‌ ప్రశ్నలతోపాటు సంబంధిత ట్రేడ్‌ ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌ ఎలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (బేసిక్‌ నాలెడ్జ్‌), జనరల్‌ సైన్స్‌ విభాగాల నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. సెక్షన్‌ బిలో సంబంధిత ట్రేడ్‌ నుంచి వంద ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ఇందులో అర్హత సాధించడానికి జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు కనీసం 40 శాతం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 35 శాతం మార్కులు పొందాలి. ఆయా విభాగాలవారీ ఖాళీలకు 12 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను టైర్‌-2 పరీక్షకు ఎంపిక చేస్తారు.

టైర్‌-2: ఇది పూర్తిగా ట్రేడ్‌ టెస్టు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న ట్రేడ్‌లో ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. ఐటీఐలో ఆ ట్రేడ్‌ లో ఉన్న అంశాలపైనే ఈ పరీక్ష నిర్వహిస్తారు. వ్యవధి గంట నుంచి రెండు గంటల వరకు ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. తుది నియామకాలు టైర్‌-1 మెరిట్‌, రిజర్వేషన్‌ ప్రకారం ఉంటాయి. 
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. 
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం:  జూన్‌ 3 ఉదయం 10 గంటల నుంచి 
ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు:  జూన్‌ 26 సాయంత్రం 5 గంటలు 
టైర్‌ 1 పరీక్ష కేంద్రాలు: ఏపీ తెలంగాణల్లో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం 
పరీక్ష తేదీలు: తర్వాత ప్రకటిస్తారు. 
: https://www.drdo.gov.in


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.