
తాజా వార్తలు
తెలుసుకుని వాడండి!
ప్రస్తుతం అమ్మాయిలు తప్పనిసరిగా వాడే సౌందర్య ఉత్పత్తుల్లో డియోడరెంట్లు కూడా ఒకటి. అయితే వీటిని సరైన దిశలో వాడకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చు.
* డియోడరెంట్లు కొన్ని గంటలపాటు శరీరం సుగంధ పరిమళాలను వెదజల్లుతాయి. అయితే వీటి తయారీకి రకరకాల రసాయనాలను వాడతారు. దాంతో తరచూ వాడితే సమస్యలే. ముఖ్యంగా బాహుమూలలు రొమ్ము కణజాలానికి దగ్గరగా ఉంటాయి. అక్కడే ఎక్కువగా వీటిని ఉపయోగిస్తాం. దాంతో క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు.
* అలంకరణ మొత్తం పూర్తయ్యాక డియోడరెంట్ని స్ప్రే చేసుకోవాలి. అప్పుడే ఆ పరిమళాలను మీ శరీరం గ్రహిస్తుంది. డియోడరెంట్లలోని రసాయనాల వల్ల చర్మం త్వరగా తేమను కోల్పోతుంది. దాంతో దురద, రాషెస్ లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే మాయిశ్చరైజర్ రాసుకున్నాక దీన్ని చల్లుకోండి.
* శరీర సువాసన కోసం అదేపనిగా డియోడరెంట్లు వాడాల్సిన అవసరంలేదు. స్నానం చేసే నీటిలో కాస్త గులాబీ నీరు, చక్రాల్లా కోసిన నిమ్మ, కొన్ని వేపాకులు వేస్తే సమస్య దూరమవుతుంది.