close

తాజా వార్తలు

Published : 03/06/2019 00:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సప్లై చైన్‌లో ఐఐఎం కోర్సు

ఎక్కడో విదేశాల్లో తయారవుతున్న వస్తువులను కూడా మనం వినియోగిస్తున్నాం.  ఇదెలా సాధ్యమని అనిపించిందా? వస్తువు తయారవడానికి ముడిసరుకును ఫ్యాక్టరీకి తరలించడం నుంచి వినియోగదారుడికి చేరేవరకు వివిధ దశలుంటాయి. అందుకు అవసరమైన సమన్వయమే ‘సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌’. తయారీ, సేవా రంగాల్లో ఇది ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఆసక్తి ఉన్నవారికి ఇదొక మంచి కెరియర్‌గానూ ఉపయోగపడుతుంది. ఐఐఎం కోల్‌కతా సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ ప్రవేశ ప్రకటన వెలువడిన సందర్భంగా ఈ కోర్సు విశేషాలు...

వ్యాపార రంగంలో ఉన్న తీవ్ర పోటీ నేపథ్యంలో లాజిస్టిక్స్‌, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ల పాత్ర గణనీయంగా పెరిగింది. వస్తువులను సకాలంలో వినియోగదారుడికి చేరేందుకూ, వారితో మంచి సంబంధాలు పెంచుకోవడానికీ ఇవి తోడ్పడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా సంబంధిత కోర్సులు చదవడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కోల్‌కతా (ఐఐఎంసీ) అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌  సప్లై చైన్‌  మేనేజ్‌మెంట్‌ (ఏపీఎస్‌సీఎం)లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐఐఎంసీ, హుగ్స్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నాయి.

కోల్‌కతాలోని ఐఐఎంకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వ్యాపారరంగంలో ఆయా విభాగాల్లో విద్యార్థులకు నైపుణ్యాలు మెరుగుపర్చడమే దీని లక్ష్యం. ఇది పోస్ట్‌గ్రాడ్యుయేట్‌, ఎగ్జిక్యూటివ్‌ ట్రైనింగ్‌, రిసెర్చ్‌ అండ్‌ కన్సల్టింగ్‌, డాక్టొరల్‌ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. 
హుగ్స్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఉద్యోగులకు ఆన్‌లైన్‌ క్లాసెస్‌ ద్వారా సర్టిఫికెట్‌ కోర్సులు అందింస్తోంది. ఇది దేశంలో ఉన్న ప్రముఖ బిజినెస్‌ స్కూల్స్‌ ఐఐటీ అహ్మదాబాద్‌,  ఐఐఎంసీ, ఐఐఎఫ్‌టీ న్యూదిల్లీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జమ్‌షద్‌పూర్‌, ఇన్‌సోఫ్‌లతో సంయుక్తంగా వివిధ మార్కెటింగ్‌ కోర్సులను ఆన్‌లైన్‌ ద్వారా అందిస్తోంది. 


అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ 
వినియోగదారుడికి తను కోరుకుంటున్న దాన్ని త్వరగా చేరవేసేందుకు సప్లై చైన్‌ వ్యూహం ముఖ్యమైనది. ఈ కోర్సు దానికి అనుగుణంగా కొత్త ఆలోచనలతో కూడిన స్ట్రాటజీ ప్లానింగ్‌ పరిజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఆపరేషన్స్‌, అకౌంటింగ్‌, మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌, ఎకనామిక్స్‌ తదితరాల అన్నింటిపై అవగాహన పెంచుకోవచ్చు. ఈ రంగంలో ఎదురయ్యే సమస్యలను బృందంతో కలసి పరిష్కరించే సామర్థ్యాన్ని పొందవచ్చు. 
అర్హత- ఎంపిక విధానం: ఏదైనా విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ (10 ్ఘ 2్ఘ 3్శ/ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులు అర్హులు. లాజిస్టిక్‌, సప్లై సిస్టమ్‌ అన్ని విభాగాల్లో రెండు సంవత్సరాలు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్ష, ప్రొఫైలింగ్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. 


తరగతులన్నీ ఆన్‌లైన్‌లోనే... 
ఈ కోర్సుకు సంబంధించిన ఆన్‌లైన్‌ క్లాసులు వారంలో ఒకరోజు ఉంటాయి. దీని కాల వ్యవధి ఒక సంవత్సరం. మొత్తం కోర్సు కాలంలో ఐఐఎంసీ క్యాంపస్‌లో పదిరోజులు తరగతులు నిర్వహిస్తారు. 
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేది: జులై 23 
మరింత సమాచారం కోసం:  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ కోల్‌కతా (ఐఐఎంసీ), డైమండ్‌ హార్బర్‌ రోడ్‌, జోకా, కోల్‌కతా - 700104. 
వెబ్‌సైట్‌: https://www.iimcal.ac.in/ 


అన్ని అంశాలూ నేర్చుకోవచ్చు 

అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ (ఏపీఎస్‌సీఎం) ఎంతో ప్రత్యేకమైనది. సప్లై చైన్‌తో పాటు వ్యాపారానికి సంబంధించిన మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, స్ట్రాటజి, ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ తదితర అంశాలను నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. దీనిద్వారా వృత్తి, వ్యాపారపరమైన నైపుణ్యం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది సప్లై చైన్‌ ప్రొఫెషనల్స్‌గా తమ ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

- ప్రొ.బోధిబ్రత నాగ్‌, ఐఐఎంసీ అకడమిక్స్‌ డీన్

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన