close

తాజా వార్తలు

రోగిపై వైద్యుడి దాష్టీకం

జయపుర : రాజస్థాన్‌లో రోగుల పట్ల మానవత్వం చూపాల్సిన ఓ వైద్యుడు దారుణంగా ప్రవర్తించాడు. జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్‌(ఎస్‌ఎంఎస్‌) మెడికల్‌ కళాశాలకు చెందిన ప్రెసిడెంట్‌, డాక్టర్‌ ఓ రోగిని విచక్షణారహితంగా చితకబాదాడు. పక్కనే ఉన్న ఇతర సిబ్బంది, రోగుల బంధువులు వారించినా వినకుండా దాడికి పాల్పడ్డాడు.  అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన చరవాణిలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు. దీనిపై రాజస్థాన్‌ వైద్య శాఖ మంత్రి రఘుశర్మ స్పందించారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆసుపత్రి నిర్వాహకులను ఆదేశించారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.