close

తాజా వార్తలు

పదేళ్ల తేడా.. అదే విమానం.. అదే ప్రాంతం.. 

దిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్‌-32 విమానం ఆచూకీ కోసం ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. సోమవారం మధ్యాహ్నం 12.25 గంటలకు అసోంలోని జోర్హాట్‌ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన ఈ విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే గల్లంతైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుకా అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌లో దిగాల్సిన ఈ విమానంతో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. దీంతో విమానం కోసం వాయుసేన విస్తృతంగా గాలిస్తోంది. 

అయితే యాదృచ్ఛికంగా సరిగ్గా పదేళ్ల క్రితం కూడా మెచుకా సమీపంలో ఇలాంటి ప్రమాదమే చోటుచేసుకుంది. ఆ ప్రమాదానికి, తాజా ఘటనకు చాలా పోలికలున్నాయి. 2009 మెచుకా అడ్వాన్స్‌ ల్యాండింగ్‌ గ్రౌండ్‌కు బయల్దేరిన ఓ ఐఏఎఫ్‌ విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే గల్లంతైంది. ఆ తర్వాత మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో విమాన శకలాలను గుర్తించారు. అది కూడా ఏఎన్‌-32 విమానమే కావడం గమనార్హం. ఇక అప్పటి విమానంలోనూ 13 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏడుగురు ఐఏఎఫ్‌ సిబ్బంది, ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక నాటి ప్రమాదం కూడా ఇదే జూన్‌ నెలలో జరగడం గమనార్హం. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.