Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 107742
            [news_title_telugu_html] => 

డిగ్రీ, ఆనర్స్‌ డిగ్రీ తేడా?

[news_title_telugu] => డిగ్రీ, ఆనర్స్‌ డిగ్రీ తేడా? [news_title_english] => Bachelor degree Honours degree chaduvu [news_short_description] => ఆనర్స్‌ డిగ్రీల్లో చేరినవారు అదనంగా మరో ఏడాది చదవాల్సిన అవసరమేమీ ఉండదు. బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బ్యాచిలర్‌ డిగ్రీ ఆనర్స్‌.. రెండింటి కాలవ్యవధీ మూడేళ్లే. సాధారణంగా డిగ్రీస్థాయిలో ఉన్న అవకాశాలు- బీఎస్‌సీ, బీఏ, బీకాం. వీటిల్లో విద్యార్థి తనకు నచ్చిన/ అవకాశమున్న కాంబినేషన్లతో మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసుకుంటాడు... [news_tags_keywords] => Bachelor degree, Honours degree, chaduvu [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-05 00:42:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
డిగ్రీ, ఆనర్స్‌ డిగ్రీ తేడా? - Bachelor degree Honours degree chaduvu - EENADU
close

తాజా వార్తలు

డిగ్రీ, ఆనర్స్‌ డిగ్రీ తేడా?

* చాలాకాలం నుంచి నాకో సందేహం. ఆనర్స్‌ డిగ్రీ అంటుంటారు కదా? అదేమిటి? దీనిలో ఏడాది ఎక్కువ చదవాలా?

- ప్రవీణ్‌, కొత్తగూడెం

 

ఆనర్స్‌ డిగ్రీల్లో చేరినవారు అదనంగా మరో ఏడాది చదవాల్సిన అవసరమేమీ ఉండదు. బ్యాచిలర్స్‌ డిగ్రీ/ బ్యాచిలర్‌ డిగ్రీ ఆనర్స్‌.. రెండింటి కాలవ్యవధీ మూడేళ్లే. సాధారణంగా డిగ్రీస్థాయిలో ఉన్న అవకాశాలు- బీఎస్‌సీ, బీఏ, బీకాం. వీటిల్లో విద్యార్థి తనకు నచ్చిన/ అవకాశమున్న కాంబినేషన్లతో మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసుకుంటాడు. దీనిలో ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని పొందుతాడు. ఆనర్స్‌ విషయానికొస్తే ఒకే సబ్జెక్టును ప్రధానంగా చదువుతాడు. విశ్లేషణకూ, సొంత ఆలోచనలను రూపొందించుకునే అవకాశం ఇస్తుంది ఆనర్స్‌. మూడు సబ్జెక్టులనూ చదివినా, ఒక దానిలో ప్రత్యేకంగా ప్రావీణ్యం లభించేలా చేస్తుంది ఇది. కాబట్టి, విద్యార్థి తనకు బాగా ఆసక్తి ఉన్న అంశంలో నైపుణ్యం సాధించాలనుకుంటే ఆనర్స్‌ డిగ్రీని ఎంచుకోవచ్చు.

ఉదాహరణకు- బీఏ సైకాలజీ (ఆనర్స్‌) ఎంచుకున్నారనుకుంటే.. సైకాలజీతోపాటు సోషియాలజీ, ఇంగ్లిష్‌ కూడా చదవాల్సి ఉంటుంది. అయితే ప్రధాన దృష్టి మాత్రం సైకాలజీపై ఉంటుంది. ఆనర్స్‌ ఉద్దేశం విద్యార్థిలో పరిజ్ఞానాన్ని పెంపొందించడంతోపాటు సంబంధిత సబ్జెక్టులో పరిశోధనకు అవసరమైన నైపుణ్యాలను పెంచడం. జనరల్‌ డిగ్రీ విషయంలో నిర్ణీత సబ్జెక్టులన్నింటి పరిచయం ఏర్పడుతుంది. ఆనర్స్‌ డిగ్రీతో పోలిస్తే జనరల్‌ డిగ్రీని సులువని చెబుతారు. ఉద్యోగ విషయంలోనూ జనరల్‌ డిగ్రీ వారితో పోలిస్తే.. ఆనర్స్‌ డిగ్రీ వారికి ప్రాధాన్యం కాస్త ఎక్కువ ఉంటుంది.

ఆనర్స్‌ డిగ్రీలు సాధారణ డిగ్రీలోనే కాదు; బి.ఇ.లో, ఎంఎస్సీలో కూడా ఉన్నాయి. సుప్రసిద్ధ విద్యాసంస్థ బిట్స్‌ పిలానీ కెమికల్‌,. సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌,. ఈఈఈ, ఈఐఈ, మెకానికల్‌, మాన్యుఫాక్చరింగ్‌ విభాగాల్లో బి.ఇ. ఆనర్స్‌ కోర్సులను అందిస్తోంది. ఇక్కడే ఎంఎస్సీ ఆనర్స్‌ కోర్సులు బయాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌,  మ్యాథ్స్‌, ఫిజిక్స్‌లలో అందుబాటులో ఉన్నాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.