close

తాజా వార్తలు

పురాతత్వ శాఖలో ప్రవేశించేదెలా?

* బీఏ పూర్తిచేశాను. వయసు 31 ఏళ్లు. పురాతత్వ శాఖ వైపు వెళ్లాలని ఉంది. నాకున్న అవకాశాలేంటి?

- సతీష్‌
 

 

పురాతత్వ శాఖపై ఆసక్తి ఉన్నవారికి ఆర్కియాలజీ కోర్సు ఒక చక్కని మార్గం. చరిత్ర మీద ఆసక్తితోపాటు నాగరికత గురించి తెలుసుకోవాలనే కోరికా ఉంటే ఈ రంగానికి మీరు సరైనవారు కాగలరు. ఆర్కియాలజీ చదవాలనుకునే వారికి డిగ్రీలో చరిత్ర ఒక సబ్జెక్టుగా ఉండాలి. మీకు ఉంది కాబట్టి, మీరు అర్హులే.
ముంబయి యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ అలహాబాద్‌ వంటి విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును జాతీయ స్థాయిలో అందిస్తున్నాయి. ఆర్కియాలజీ చదివినవారు ఆర్కియాలజిస్టులు, రిసెర్చ్‌ అసిస్టెంట్లు, ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలకు నియమితమయ్యే అవకాశం ఉంది.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌
మీ ప్రశ్నలు పంపాల్సిన మెయిల్‌ ఐడీ: edc@eenadu.in


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.