Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 111986
            [news_title_telugu_html] => 

పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

[news_title_telugu] => పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం [news_title_english] => militants killed in Pulwama say JK police [news_short_description] => జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొరలో భద్రతా బలగాలు.. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు.   [news_tags_keywords] => militants,Pulwama, Jammu kashmir [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-14 20:09:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం - militants killed in Pulwama say JK police - EENADU
close

తాజా వార్తలు

పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొరలో భద్రతా బలగాలు.. ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది పలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ‘‘ఉగ్రవాదులు ఉన్నారని విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు అవంతి పొరలోని బందినా ప్రాంతంలో శుక్రవారం పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడానికి ప్రయత్నించారు. దీంతో భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేశాయి. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతం నుంచి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారు ఏ ఉగ్ర సంస్థకు చెందిన వారన్న విషయం ఇప్పటి వరకు తెలియరాలేదు’’ అని జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. 

‘‘ఉగ్రవాదులను హతమార్చి అనంతరం ఆ ప్రాంత నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి వంటి పలు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాం’’ అని పోలీసులు చెప్పారు. కాగా, ఇటీవలే పుల్వామాలోని ఓ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు సోదాలు నిర్వహించి నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులను ఏరివేయడంలో భాగంగా భద్రతా బలగాలు నిర్బంధ తనిఖీలు చేపడుతున్నాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.