Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112881
            [news_title_telugu_html] => 

రోడ్డుప్రమాదం:ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి

[news_title_telugu] => రోడ్డుప్రమాదం:ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి [news_title_english] => six of family killed as car rams into truck on Yamuna Expressway near Mathura [news_short_description] => ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.   [news_tags_keywords] => car accident,Mathura,uttar pradesh [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-17 01:10:16 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రోడ్డుప్రమాదం:ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి - six of family killed as car rams into truck on Yamuna Expressway near Mathura - EENADU
close

తాజా వార్తలు

రోడ్డుప్రమాదం:ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి

మథుర: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం యమునా ఎక్స్‌ప్రెస్‌వే మీదుగా ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా.. అది ఒక్కసారిగా అదుపుతప్పి ఓ ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయని వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వేగనార్‌ కారులో వారు నోయిడా నుంచి ఆగ్రా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ఆదిత్య కుమార్‌ శుక్లా తెలిపారు.

ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గౌతమ బుద్ధా నగర్‌ జిల్లాలోని జేవార్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ప్రమాదం సంభవించిన వెంటనే ఆ కుటుంబంలోని ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, మరొకరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారని చెప్పారు. గాయాలపాలైన మరో ముగ్గురికి ఆగ్రాలోని ఓ ఆస్పత్రిలో చికిత్సి అందుతోందని, అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఓ బాలిక ఉన్నారని చెప్పారు. మృతులను నీరజ్‌ (25), అనిత (30), విష్ణు (25), కరుణ (22), సురేశ్‌ (25), మరో 13 ఏళ్ల ఓ బాలికగా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జయిపోయిందని, మృతదేహాలను బయటకు తీయడానికి గ్యాస్‌ కట్టర్లను వినియోగించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం ట్రక్‌ చోదకుడు తన వాహనాన్ని తీసుకొని పారిపోయాడని చెప్పారు.    


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.