close

తాజా వార్తలు

బ్యాంకు కొలువుల పల్లెబాట!

గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ల్ల, ఆఫీస్‌ అసిస్టెంట్ల నియామకానికి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 45 గ్రామీణ బ్యాంకుల్లో దాదాపు 3500 ఖాళీలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 5 గ్రామీణ బ్యాంకుల్లో దాదాపు 350) భర్తీ చేస్తారు. డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. రోజుకు 10 గంటలకు పైగా సమయాన్ని కేటాయిస్తూ ప్రణాళిక ప్రకారం సిద్ధమయితే బ్యాంకు ఉద్యోగం సంపాదించవచ్చు. దరఖాస్తుల గడువు జులై 4. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసి, వెంటనే ప్రిపరేషన్‌ ఆరంభించటం ఉత్తమం!

తాజా నోటిఫికేషన్లో ఆఫీస్‌ అసిస్టెంట్లను రెండంచెల ద్వారా నిర్వహించే ఆన్‌లైన్‌ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. స్కేల్‌-1 ఆఫీసర్లకు రెండంచెల ఆన్‌లైన్‌ రాతపరీక్ష,  ఇంటర్వ్యూలు, స్కేల్‌- 2, 3 ఆఫీసర్లకు ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ఒకే ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలుంటాయి.
స్కేల్‌- 1 ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్ల రాత పరీక్షలు ఒకే విధం. స్కేల్‌- 1 ఆఫీసర్ల పరీక్షలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం స్థానంలో ఆఫీస్‌ అసిస్టెంట్ల పరీక్షలో న్యూమరికల్‌ ఎబిలిటీ ఉంటుంది. ఇది మినహా ఇతర విభాగాలూ, పరీక్ష విధానం ఒకే రకం. ప్రిలిమినరీ పరీక్షలలో రెండు విభాగాల్లోని మొత్తం 80 ప్రశ్నలకు 45 ని. సమయం ఉంటుంది. మెయిన్‌ పరీక్షలో 5 విభాగాల్లోని 200 ప్రశ్నలకు 2 గంటల సమయం ఉంటుంది.
స్కేల్‌- 1, స్కేల్‌- 3 రాత పరీక్షలు స్కేల్‌- 1 మెయిన్స్‌ పరీక్ష మాదిరిగా ఉంటాయి. అయితే జనరల్‌ అవేర్‌నెస్‌ స్థానంలో ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ విభాగం వుంటుంది. స్కేల్‌- 2  స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల పరీక్షలో వీటికి అదనంగా ప్రొఫెషనల్‌ నాలెడ్జి విభాగం ఉంటుంది.ఆఫీస్‌ అసిస్టెంటు, ఆఫీసర్ల (1 2 3) పరీక్షలన్నింటిలనూ అన్ని విభాగాలలో కనీస మార్కులతో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో 4వ వంతు తగ్గిస్తారు.

డిగ్రీ/ఇంజినీరింగ్‌ పూర్తయిందా?

బ్యాంకింగ్‌ కార్యకలాపాలు, సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు  అందజేసే ప్రధాన ఉద్దేశ్యంతో స్థాపించినవే ఈ గ్రామీణ బ్యాంకులు. ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే జీతభత్యాలు తక్కువ అయినప్పటికీ తమ ప్రాంతాల్లోనే ఉద్యోగం చేయాలనుకునేవారికీ, గ్రామీణ ప్రాంతాలకు సేవచేసే ఉద్దేశమున్న అభ్యర్థులకూ ఇది చక్కని అవకాశం. స్కేల్‌-1 ఆఫీసర్‌ (అసిస్టెంట్‌ మేనేజర్‌)గా చేరిన అభ్యర్థి మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌/రీజనల్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌ స్థాయి వరకు ఆపై ఛైర్మన్‌/మేనేజింగ్‌ డైరెక్టర్‌ స్థాయి వరకు చేరుకోవచ్చు. అసిస్టెంట్‌గా జాయిన్‌ అయిన అభ్యర్థులు చీఫ్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌ స్థాయిల వరకు చేరుకోవచ్చు.
తాజాగా డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన విద్యార్థులు బ్యాంక్‌ ఉద్యోగం తమ లక్ష్యంగా వుంటే ఈ నోటిఫికేషన్‌తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పీవో, క్లర్క్‌, స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల భర్తీకి ఐబీపీఎస్‌ త్వరలో విడుదల చేయబోయే నోటిఫికేషన్లలోని పరీక్షలకు శ్రద్ధగా సిద్ధం కావాలి. పరీక్షలన్నీ దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ పరీక్షకు బాగా ప్రిపేర్‌ అయితే మిగిలిన పరీక్షలకు సన్నద్ధత తేలిక అవుతుంది.
ప్రిలిమ్స్‌ పరీక్షలకు దాదాపు 2 నెలల సమయం, మెయిన్స్‌ పరీక్షకు దాదాపు 3 నెలలకు పైగా సమయం ఉంది. ప్రిలిమ్స్‌ పరీక్షలో కేవలం రెండు సబ్జెక్టులే వున్నాయి. కాబట్టి రెండు నెలల సమయం సరిపోతుంది. అయితే ప్రిలిమ్స్‌ పరీక్షలో 80 ప్రశ్నలు సాధించడానికి 45 ని. సమయం వుంటుంది.అందుచేత సాధన చాలా అవసరం.

- డా. జీఎస్‌. గిరిధర్‌

ప్రిపరేషన్‌ మెలకువలుwww.eenadupratibha.net లో


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.