Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113264
            [news_title_telugu_html] => 

పబ్‌లో యువకులపై బౌన్సర్ల దాడి

[news_title_telugu] => పబ్‌లో యువకులపై బౌన్సర్ల దాడి [news_title_english] => bouncers attack on youth in pub [news_short_description] => పబ్బుకు వెళ్లిన యువకులపై బౌన్సర్లు దాడిచేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన కార్తీక్‌రెడ్డి, నవీన్‌, శరత్‌ చంద్రవర్మ వీరంతా కలసి జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి సమీపంలో ఉన్న ఆమ్నీషియా పబ్బుకు ఆదివారం రాత్రి వెళ్లారు. [news_tags_keywords] => attack,crime,hyderabad [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-17 10:53:52 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పబ్‌లో యువకులపై బౌన్సర్ల దాడి - bouncers attack on youth in pub - EENADU
close

తాజా వార్తలు

పబ్‌లో యువకులపై బౌన్సర్ల దాడి

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌: పబ్బుకు వెళ్లిన యువకులపై బౌన్సర్లు దాడిచేశారంటూ జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన కార్తీక్‌రెడ్డి, నవీన్‌, శరత్‌ చంద్రవర్మ కలసి జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి సమీపంలో ఉన్న ఆమ్నీషియా పబ్బుకు ఆదివారం రాత్రి వెళ్లారు. వీరు పబ్బులో ఉన్న ‌వాష్‌రూమ్‌లోకి వెళ్లే క్రమంలో బౌన్సర్ రూపేష్ వీరితో వాగ్వాదానికి దిగాడు. అదికాస్త పెద్దదై ఘర్షణకు దారితీసింది. కారణం లేకుండా తమను పబ్బు నుంచి బయటకు ఎందుకు వెళ్ళమంటున్నారని యువకులు బౌన్సర్లను నిలదీశారు. దీంతో రూపేష్‌తోపాటు మరి కొంతమంది బౌన్సర్లు కలిసి యువకులపై రాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ యువకుడి తలకు తీవ్ర గాయమైంది. కార్తీక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రూపేష్ తదితరులపై కేసు నమోదు చేసి బౌన్సర్లను అదుపులోకి తీసుకున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.