close

తాజా వార్తలు

పుల్వామాలో మరో ఉగ్రదాడి!

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. పుల్వామా సమీపంలో ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. అరిహల్‌ గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన వాహనం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది. అనంత్‌నాగ్‌ జిల్లా అచ్‌బల్‌ ప్రాంతంలో  ఉగ్రవాదులపై కాల్పులు జరిగిన కొద్ది సేపటికే  ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అచ్‌బల్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో  ఓ ఆర్మీ మేజర్‌ అమరుడు కాగా.. మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.

గత ఫిబ్రవరిలో ఇదే ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.