close

తాజా వార్తలు

బతికి ఉండగానే చంపేశారయ్యా..!

మరణించానని చెప్పి ఇల్లు అమ్మేశారు 
ఏఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధ దంపతులు

గుంటూరు నేరవార్తలు : ఆమె ఉపాధ్యాయినిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. నమ్మకంగా ఉన్న వ్యక్తే ఆమె బతికుండగానే చనిపోయిందని పుకార్లు పుట్టించి ఆమె ఇంటిని అమ్మేశారు. ఏడు పదుల వయస్సులో ఆమె, ఎనిమిది పదుల వయస్సులో ఆమె భర్త నడవలేని స్థితిలో సోమవారం ఎస్పీ కార్యాలయానికి వచ్చిన తీరు అందరిని కలచివేసింది. పడుతూలేస్తూ వస్తున్న ఆ వృద్ధ దంపతులను అక్కడి మహిళా ఏఎస్సై శివకుమారి గమనించి వారికి ఎదురు వెళ్లి చేయిచ్చి చేతులు పట్టుకుని గ్రీవెన్స్‌డేలో కుర్చోపెట్టి వారి సమస్యను ఆలకించారు. చనిపోయిందని ఆస్తి స్వాహా చేసిన వైనంపై ఏఎస్పీ మూర్తికి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఏఎస్పీ విచారణకు ఆదేశించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన చిలకా ఆరోగ్యమ్మ విశ్రాంత ఉపాధ్యాయిని. ఆమె భర్త రాములు బియ్యం వ్యాపారం చేసేవారు. ఆయన కొంత కాలంగా వినికిడి, నేత్ర సమస్యతో బాధపడుతున్నాడు. దంపతులిద్దరూ ఏడాది కిందట ఆటోలో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో ఆమెకు బలమైన గాయాలు తగలడంతో ఆసుపత్రిలో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడ నుంచి తన తల్లి ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంది. వృద్ధాప్యంలో అక్కరకు వస్తుందని నరసరావుపేటలో 2.5 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో దాని విలువ సుమారు రూ. 2 కోట్ల వరకు ఉండవచ్చని ఆమె చెబుతోంది. ఆటోడ్రైవర్‌గా పనిచేసే ఓ వ్యక్తిని ఆ వృద్ధ దంపతులు దగ్గరకు తీశారు. ముసలి వాళ్లు కావడంతో సదరు వ్యక్తి వారిని ఎక్కడికైనా తన ఆటోలో తీసుకువెళ్లడం, వైద్యానికి సంబంధించిన మందులు తెచ్చి ఇవ్వడం చేస్తూ నమ్మకస్తుడిగా మారాడు. వాళ్లు కూడా అతన్ని సొంత మనిషిగా భావించారు. వాళ్లకు రోడ్డు ప్రమాదం జరిగి నెలలుగా సొంతింటికి వెళ్లలేదు. దీనితో అతను ఆరోగ్యమ్మ చనిపోయిందనే పుకార్లు పుట్టించాడు. అంతటితో ఆగకుండా ఆమెకు చెందిన ఇంటికి ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమ్మేశాడు. తనను మోసగించిన వైనంపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని ఆమె చెప్పింది. అదే విషయాన్ని ఎస్పీ కార్యాయలంలోనూ ఫిర్యాదు అందించి సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరినట్లు ఆమె వివరించింది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.