close

తాజా వార్తలు

బస్సు ప్రమాదానికి అడ్డు‘గోడ’

ఖమ్మం జిల్లాలో తప్పిన పెను ముప్పు

ఏన్కూరు: ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద నాగార్జునసాగర్‌ ప్రధాన కాల్వ వంతెన గోడను మణుగూరు డిపో బస్సు సోమవారం ఢీకొంది. అయితే బస్సు కాల్వలోకి దూసుకెళ్లకుండా వంతెన గోడ అడ్డుకోగలిగింది. ఖమ్మం నుంచి మణుగూరు వెళ్తున్న ఆ బస్సులో 66 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కొద్ది సేపటికి సురక్షితంగా బయట పడి ఊపిరి పీల్చుకున్నారు. వర్షం కురుస్తుండటం, ఎదురుగా వస్తున్న మరో బస్సును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌ ప్రభాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.