Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113779
            [news_title_telugu_html] => 

ఉగ్రమూకల ఆగడాలను అరికట్టండి: కాంగ్రెస్‌

[news_title_telugu] => ఉగ్రమూకల ఆగడాలను అరికట్టండి: కాంగ్రెస్‌ [news_title_english] => Govt intel agencies must take suitable action to prevent attacks in future Cong [news_short_description] => జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులతో జరుగుతున్న వరుస ఘర్షణల్లో భద్రతా సిబ్బంది మరణిస్తున్నా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. వెంటనే పటిష్ఠ చర్యలు చేపట్టి ఉగ్రమూకల ఆగడాలకు..... [news_tags_keywords] => congress,modi,terrorists,pulwama [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-18 22:41:54 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఉగ్రమూకల ఆగడాలను అరికట్టండి: కాంగ్రెస్‌ - Govt intel agencies must take suitable action to prevent attacks in future Cong - EENADU
close

తాజా వార్తలు

ఉగ్రమూకల ఆగడాలను అరికట్టండి: కాంగ్రెస్‌

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్ ఉగ్రవాదులతో జరుగుతున్న వరుస ఘర్షణల్లో భద్రతా సిబ్బంది మరణిస్తున్న అంశంపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే పటిష్ఠ చర్యలు చేపట్టి ఉగ్రమూకల ఆగడాలకు అరికట్టాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. భవిష్యత్తులో మరిన్ని ఉగ్రదాడులు జరగకుండా మోదీ ప్రభుత్వం, నిఘా విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పుల్వామా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ దాడిలో తొమ్మిది మంది జవాన్లు గాయపడిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ఈ వ్యాఖ్యలు చేసింది.

కశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య తరచూ తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. గత వారం రోజుల్లో దాదాపు పది మంది సైనికులు మరణించినట్లు సమాచారం. సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఆర్మీ మేజర్‌ మృతి చెందారు. అప్పుడు  ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌ ఈరోజు మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఈ ఘటనలో ఓ జవాన్‌ మృతిచెందగా.. ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మరో ఘటనలో, పాకిస్థాన్‌ రెండు రోజుల క్రితం హెచ్చరించినట్లుగానే.. ఉగ్రవాదులు పుల్వామా తరహా దాడికి విఫలయత్నం చేశారు. ఈ ఘటనలో 9 మంది గాయపడగా.. వారిలో ఇద్దరు ఈరోజు మృతి చెందారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.