
తాజా వార్తలు
అమెరికాలో తెలుగు కుటుంబం మృతిపై పోలీసులు వెల్లడి
వాషింగ్టన్: అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని వెస్ట్ డి మాయిస్ నగరంలో తెలుగు కుటుంబంలో ఇటీవల నలుగురు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన సుంకర చంద్రశేఖర్ తన భార్య లావణ్య, ఇద్దరు పిల్లల్ని కాల్చి చంపి ఆపై ఆయనా ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. ఈ నాలుగు మృతదేహాలకు అటాప్సీ నిర్వహించిన అధికారులు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
గుంటూరు జిల్లాకు చెందిన చంద్రశేఖర్, లావణ్య దంపతులు చాలాకాలం క్రితమే అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. టెక్నాలజీ సర్వీస్ బ్యూరోలో గత 11 ఏళ్లుగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఆయుధం కలిగి ఉండేందుకు ఏప్రిల్లోనే అనుమతి పొందారు. ఆ తర్వాత ఆయన ఒక ఆయుధం కొన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ ఆయుధాన్ని ఎక్కడ కొన్నారో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. 2018లో చంద్రశేఖర్ లక్ష డాలర్లకు పైగానే ఆర్జించారని అయోవా పరిపాలనా విభాగం తెలిపింది.
శనివారం వెస్ట్ డి మాయిస్ నగరంలోని 19వ బ్లాక్, 65వ వీధిలో నాలుగు మృతదేహాలు ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. అటాప్సీ చేయించిన తర్వాత చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులను కాల్చి చంపి ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రకటించారు. భార్యా, బిడ్డలను ఎందుకు చంపాడో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఆ దిశగా ఆధారాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు సుంకర చంద్రశేఖర్ బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
