Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114200
            [news_title_telugu_html] => 

నా పులి బిడ్డ ఎక్కడికెళ్లాడు?

[news_title_telugu] => నా పులి బిడ్డ ఎక్కడికెళ్లాడు? [news_title_english] => Mera sher beta kahan gaya A mother weeps as terrorism claims another Army Majors life [news_short_description] => ఎండనక వాననక దేశ సరిహద్దుల్లో గస్తీ కాచే జవాన్ల సేవలకు వెల కట్టలేం. కంటి ముందు కుటుంబ సభ్యులు ఒకటి రెండు రోజులు కనబడకపోతేనే ఏదో వెలితిగా ఉంటుంది.... [news_tags_keywords] => Jammu and Kashmir,Anantnag, Army ,Ketan Sharma [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-19 17:31:48 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నా పులి బిడ్డ ఎక్కడికెళ్లాడు? - Mera sher beta kahan gaya A mother weeps as terrorism claims another Army Majors life - EENADU
close

తాజా వార్తలు

నా పులి బిడ్డ ఎక్కడికెళ్లాడు?

కన్నీరు పెట్టించిన జవాను తల్లి రోదన

అనంత్‌నాగ్‌: ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దుల్లో గస్తీ కాచే జవాన్ల సేవలకు వెల కట్టలేం. ‘మళ్లీ వస్తాను’ అని నవ్వుతూ చెప్పి వెళ్లిన బిడ్డ..తిరిగి విగత జీవిగా ఇంటికొస్తే ఏ తల్లి మాత్రం తట్టుకోగలదు!. అలాంటి పరిస్థితే రెండు రోజుల క్రితం ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ మేజర్‌ తల్లికి ఎదురైంది. 19 రాష్ట్రీయ రైఫిల్స్‌ విభాగంలో పనిచేసే మేరఠ్‌కు చెందిన ఆర్మీ మేజర్‌ కేతన్‌ శర్మ ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో అమరుడయ్యారు. ఆయన మృతదేహాన్ని అధికారులు ఇంటికి చేర్చారు. కేతన్‌ను విగత జీవిగా చూసిన కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘నా పులి బిడ్డ ఎక్కకెళ్లాడో చెప్పండి?’ అంటూ కేతన్ తల్లి రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కంట తడిపెట్టించింది.

అమరుడైన ఆర్మీ మేజరుకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అంతకు ముందు ఆయన మృతదేహాన్ని మేరఠ్‌లోని కంటోన్మెంట్‌ ఏరియాలో ఉంచారు. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌ ఆయనకు నివాళులు అర్పించారు. జమ్ముకశ్మీరులోని అనంత్‌నాగ్‌లో సోమవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాద అలికిడి గురించి తెలుసుకున్న భారత సైన్యం అక్కడ పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేసింది. దీన్ని పసిగట్టిన ఉగ్రమూకలు సైన్యంపై ఎదురుకాల్పులకు దిగారు. అప్పటికే అప్రమత్తమయిన భారత సైన్యం వారి చర్యలను తిప్పికొట్టింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఎదురు కాల్పుల సమయంలో ఆర్మీ మేజర్‌ కేతన్‌ శర్మ తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ తుది శ్వాస విడిచారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.