close

తాజా వార్తలు

హన్మకొండ ఘటనపై పెల్లుబికిన నిరసన

నిందితుడిని ఉరితీయాల్సిందేనని ప్రజలు ఆందోళన

హన్మకొండ‌: హన్మకొండ ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజలు ఆందోళన బాటపట్టారు. అశోక కూడలి వద్ద మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి చంపిన దుర్మార్గుడిని చంపేంతవరకూ ఆందోళన విరమించేది లేదంటూ ఎండలో కూర్చొని నిరసన తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఘటనపై తీవ్రంగా స్పందించిన మంత్రి ఎర్రబెల్లి
మరోవైపు, హన్మకొండ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తీవ్రంగా స్పందించారు. చిన్నారి అఘాయిత్యం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. బాధిత కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే..?
హన్మకొండలోని కుమార్‌పల్లిలో తొమ్మిది నెలల పాపపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి హతమార్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తల్లిదండ్రులతో కలిసి డాబాపై నిద్రిస్తుండగా పక్క కాలనీలో నివాసముంటున్న ప్రవీణ్‌ అనే యువకుడు పాపను బయటకు తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారి కన్పించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అత్యాచారం చేసిన తర్వాత ఉన్మాది ప్రవీణ్‌ తీసుకెళ్తుండగా స్థానికులు గుర్తించడంతో కిందపడేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. ఈ చిట్టితల్లిని విగతజీవిగాచూసిన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు. తమ గారాల పట్టిని హతమార్చిన ఉన్మాదిని ఉరితీయాలంటూ రోధించారు. సభ్య సమాజం తలదించుకొనేలా జరిగిన ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.