Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114601
            [news_title_telugu_html] => చెల్లెలి గొంతు కోసిన అన్న
            [news_title_telugu] => చెల్లెలి గొంతు కోసిన అన్న
            [news_title_english] =>  Attack on sister with sword
            [news_short_description] => దివ్యాంగుడిని వివాహం చేసుకుంటుందనే కోపంతో ఓ యువకుడు తన చిన్నమ్మ కుమార్తె గొంతు కోసిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. మూడో పట్టణ సీఐ సుదర్శనప్రసాద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

            [news_tags_keywords] => nandyala,crime
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-20 06:53:14
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
చెల్లెలి గొంతు కోసిన అన్న - Attack on sister with sword - EENADU
close

తాజా వార్తలు

చెల్లెలి గొంతు కోసిన అన్న

ఇష్టం లేని వివాహం చేసుకుంటోందని కత్తితో దాడి!

నంద్యాల నేరవార్తలు: దివ్యాంగుడిని వివాహం చేసుకుంటుందనే కోపంతో ఓ యువకుడు తన చిన్నమ్మ కుమార్తె గొంతు కోసిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. మూడో పట్టణ సీఐ సుదర్శనప్రసాద్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడలో నివాసముంటున్న అమర్‌నాథ్‌గౌడ్‌, లక్ష్మీదేవిల కుమార్తె జ్యోతి సెలవులకు నంద్యాల పట్టణం నూనెపల్లెలోని తాతయ్య ఇంటికి అమ్మతో కలిసి వచ్చింది. ఇటీవలే జ్యోతికి తల్లిదండ్రులు ప్రభుత్వ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుడిగా పని చేస్తున్న దివ్యాంగుడైన సుదర్శన్‌తో పెళ్లి కుదిర్చారు. రుద్రవరం మండలం తెప్పారెడ్డిపల్లెకు చెందిన జ్యోతి పెద్దమ్మ కుమారుడు సుబ్బరాయుడుకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వారం రోజుల క్రితం అతను నూనెపల్లెలోని తాతయ్య ఇంటికి వచ్చాడు. చిన్నమ్మ కుమార్తె జ్యోతితో బాగానే మాట్లాడుతుండేవాడు. కానీ దివ్యాంగుడైన సుదర్శన్‌ను పెళ్లి చేసుకోవద్దని ఆమెపై ఒత్తిడి తెచ్చేవాడు. ఎన్నిసార్లు చెప్పినా వినవా అంటూ మంగళవారం రాత్రి నుంచి గొడవపడుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటలకు ఇంట్లో ఎవరూలేని సమయంలో సుబ్బరాయుడు కత్తితో జ్యోతిని పొడవబోయాడు. ఆమెచేయి అడ్డంపెట్టడంతో చేతికి గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా మళ్లీ రెండుసార్లు కత్తితో గొంతుపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కేకలకు స్థానికులు వచ్చేలోగా సుబ్బరాయుడు పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న జ్యోతిని వెంటనే నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మూడో పట్టణ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆస్తి కోసమేనా? 
సుబ్బరాయుడు చిన్నమ్మకు జ్యోతి ఒక్కరే కుమార్తె. ఆమెకు పెళ్లి చేస్తే ఆస్తి అంతా వేరేవాళ్లకు వెళ్తుందనే సుబ్బరాయుడు హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుబ్బరాయుడు గతంలో నాలుగేళ్లపాటు విజయవాడలో జ్యోతి వాళ్ల ఇంట్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసినట్లు బంధువులు చెబుతున్నారు. పెళ్లి కోసమే అయితే పెద్దలకు చెప్పి రద్దు చేయించవచ్చు కదా? వాళ్ల కుటుంబంతో అంత సాన్నిహిత్యమున్న వ్యక్తి ఇలాంటి ఘాతుకానికి ఎలా పాల్పడ్డాడు? ఇంకేమైనా బలమైన కారణాలున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.