Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114609
            [news_title_telugu_html] => 

కోల్‌కతా వీధుల్లో ఓ కాళరాత్రి!

[news_title_telugu] => కోల్‌కతా వీధుల్లో ఓ కాళరాత్రి! [news_title_english] => Goons attack Former Miss India Universe Ushoshi Senguptas Uber driver in Kolkata [news_short_description] => నడిరోడ్డుపై ఆకతాయిల అనాగరిక ప్రవర్తన..అడ్డుకోవాల్సిన పోలీసుల బాధ్యతారహిత్యం కోల్‌కతాలో సోమవారం రాత్రి మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌... [news_tags_keywords] => attack,Kolkata,crime [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-20 07:37:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కోల్‌కతా వీధుల్లో ఓ కాళరాత్రి! - Goons attack Former Miss India Universe Ushoshi Senguptas Uber driver in Kolkata - EENADU
close

తాజా వార్తలు

కోల్‌కతా వీధుల్లో ఓ కాళరాత్రి!

మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌కు చేదు అనుభవం

కోల్‌కతా: నడిరోడ్డుపై ఆకతాయిల అనాగరిక ప్రవర్తన..అడ్డుకోవాల్సిన పోలీసుల బాధ్యతారహిత్యం కోల్‌కతాలో సోమవారం రాత్రి మాజీ మిస్‌ ఇండియా యూనివర్స్‌ ఉష్రోషి సేన్‌గుప్తాకు పీడకలనే మిగిల్చింది. రాత్రి 11.40గంటల ప్రాంతంలో జేడబ్ల్యూ మారియట్‌లో విధులు ముగించుకుని సహోద్యోగితో కలిసి ‘ఊబర్‌’లో ఉష్రోషి సేన్‌గుప్తా ఇంటికి బయలుదేరగా మార్గ మధ్యంలో బైకులపై వచ్చిన కొందరు యువకులు ట్యాక్సీని ఢీకొట్టారు. రాళ్లు విసరటంతోపాటు డ్రైవర్‌ను చితకబాదడం మొదలు పెట్టారు. ఉష్రోషి రోడ్డుకు అవతలి వైపున ఉన్న పోలీసుస్టేషన్‌కు పరుగున వెళ్లి ఘోరాన్ని ఆపాలని వేడుకున్నారు. అక్కడున్న పోలీసు అధికారి తమ పోలీస్‌స్టేషన్‌ పరిధి కాదంటూ తాత్సారం చేశాడు. ఉష్రోషి కన్నీటి పర్యంతం కావడంతో స్టేషన్‌ అధికారి ఘటనా స్థలికి రాగా యువకులు ఆయన్ను పక్కకు తోసి పారిపోయారు. ట్యాక్సీలో బయలుదేరిన కొద్ది సమయానికి మళ్లీ ఆ యువకులు ఉష్రోషి వాహనాన్ని చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించారు. దాడి ఘటనను వీడియో తీసినందుకు ఆమె ఫోన్‌ లాక్కునే యత్నం చేశారు. భయాందోళనలతో ఆమె గట్టిగా అరవడంతో పారిపోయారు. ఆ తర్వాత మరో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా తమ పరిధికాదన్నారు. హెల్మెట్‌ లేకుండా బైకుల మీద తిరుగుతున్న అంత మందిని పోలీసులు ఎందుకు పట్టించుకోవటంలేదన్న ఆమె ప్రశ్నకు బదులిచ్చే వారే లేకపోయారు. ఈ దారుణాన్ని ఆమె సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బుధవారం ఏడుగురిని అరెస్టు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయలేదన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.