Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 115224
            [news_title_telugu_html] => 

ప్లాస్టిక్‌ బ్యాగ్‌ మెడకు చుట్టుకుని టాపర్‌ ఆత్మహత్య!

[news_title_telugu] => ప్లాస్టిక్‌ బ్యాగ్‌ మెడకు చుట్టుకుని టాపర్‌ ఆత్మహత్య! [news_title_english] => Class 10 Girl Found Dead with Wrist Slit Plastic Bag Around Head in Bathroom of Kolkatas GD Birla School [news_short_description] => మణికట్టుపై గాయంతో, మెడకు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌ చుట్టుకుని ఓ విద్యార్థిని రక్తమోడుతూ స్కూల్‌ టాయిలెట్‌లో కనిపించడం కోల్‌కతాలో కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడి జీడీ బిర్లా స్కూల్‌లో..... [news_tags_keywords] => crime,Kolkata,Class 10 Girl [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-21 22:20:32 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ప్లాస్టిక్‌ బ్యాగ్‌ మెడకు చుట్టుకుని టాపర్‌ ఆత్మహత్య! - Class 10 Girl Found Dead with Wrist Slit Plastic Bag Around Head in Bathroom of Kolkatas GD Birla School - EENADU
close

తాజా వార్తలు

ప్లాస్టిక్‌ బ్యాగ్‌ మెడకు చుట్టుకుని టాపర్‌ ఆత్మహత్య!

కోల్‌కతా: మణికట్టుపై గాయంతో, మెడకు ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌ చుట్టుకుని ఓ విద్యార్థిని రక్తమోడుతూ స్కూల్‌ టాయిలెట్‌లో కనిపించడం కోల్‌కతాలో కలకలం రేపింది. శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడి జీడీ బిర్లా స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థినిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పదోతరగతి విద్యార్థిని అయిన ఆమె క్లాస్ టాపర్‌ కావడం గమనార్హం.

ఘటనా స్థలిలో మూడు పేజీల సూసైడ్‌ నోట్‌ కూడా దొరికినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఒత్తిడి కారణంగానే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలస్తోంది. టాయిలెట్‌కని వెళ్లిన బాలిక ఎంతకీ రాకపోవడంతో తలుపు తెరిచి చూడగా.. చేతికి గాయంతో, ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగ్‌ మెడకు చుట్టుకుని రక్తస్రావమవుతూ కనిపించింది. లోపల తన అరుపులు బయట వారికి వినిపించకుండా బ్యాగ్‌ను మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.