close

తాజా వార్తలు

కానిస్టేబుల్‌ని రోడ్డుపై 100 మీటర్లు ఈడ్చుకెళ్లాడు!

కోల్‌కతా: ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ని ద్విచక్ర వాహనదారుడు 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటన పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో చోటు చేసుకుంది. బెక్‌బగాన్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి పోలీసులు బుధవారం వివరాలు తెలిపారు. ఓ పాదచారుడిని ఢీకొట్టిన అనంతరం ఆ ద్విచక్ర వాహనదారుడు పారిపోతుండగా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అతడిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

‘‘ట్రాఫిక్ కానిస్టేబుల్‌ తపాన్‌ ఓరంగ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతడి కాళ్లు, చేతులకు అయిన గాయాలకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు’’ అని పోలీసులు తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బెక్‌బగాన్‌ ప్రాంతంలో ఓ ద్విచక్ర వాహనదారుడు అర్ధరాత్రి సమయంలో ఓ వృద్ధుడిని ఢీ కొట్టాడు. దీంతో ఆ వృద్ధుడు కిందపడిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ ఓరంగ్‌.. ఆ ద్విచక్ర వాహదారుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఓరంగ్‌ చేతిని పట్టుకున్న ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ ద్విచక్ర వాహనదారుడిని గుర్తించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఓరంగ్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వచ్చిన కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ అనేజ్‌ శర్మ.. ఆయనను పరామర్శించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.