
తాజా వార్తలు
సందర్భం
భక్తులకు వరాలివ్వడానికి దేవుడు దిగివచ్చిన కథలు మనం విన్నాం... కానీ ఈయన చాలా ప్రత్యేకం. 40 ఏళ్ల ఎదురు చూపులకు తెరదించాడు. నీటి నుంచి పైకి వచ్చిమరీ అనుగ్రహిస్తున్నాడు. తమిళుల ఆరాధ్యదైవంగా... కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్ కథ ఇది... ఈనెల 1న ప్రారంభమైన అత్తివరదర్ వేడుకలు 48 రోజుల పాటు జరగనున్నాయి.
దేశంలోని శ్రీవైష్ణవ దివ్య క్షేత్రాల్లో కాంచీపురం ఒకటి. అక్కడి వైష్ణవాలయాల్లో ప్రసిద్ధి చెందింది వరదరాజ పెరుమాళ్ ఆలయం. వేఘవతి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో మూలవిరాట్టు వరదరాజ పెరుమాళ్ పశ్చిమంవైపు, తాయారు పెరుందేవి తూర్పు వైపు నిలబడినట్లు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయం ఉన్న కొండ ఏనుగు రూపంలో ఉంటుంది. పెరుమాళ్‌ను మోస్తున్నందున ఈ కొండకు అత్తిగిరి కొండ అని కూడా పేరు ఉంది. ఈ ఆలయంలోనే బంగారు, వెండి బల్లులు భక్తులకు దర్శనమిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ మించిన మరో విశిష్టత ఇక్కడ ఉంది.
అదేంటంటే...
ఆలయ ప్రాగణంలోని అనంత సరస్సు (పుష్కరిణి)లో మూడు మంటపాలున్నాయి. ఆరు స్తంభాలు, నాలుగు స్తంభాల మంటపాలతో పాటు శ్రీకృష్ణుడి దివ్య విగ్రహం ప్రతిష్ఠించిన మంటపాలు ఉన్నాయి. అత్తి వరదర్గా పిలుస్తున్న వరదరాజ స్వామి విగ్రహాన్ని వెండి పెట్టెలో పెట్టి నాలుగు స్తంభాల మంటపంలో నీటి అడుగు భాగాన భద్రపరిచారు. 40 సంవత్సరాలకు ఒకసారి పుష్కరిణిలోని నీటిని తోడేసి విగ్రహం ఉన్న పెట్టెను బయటకుతీసి విగ్రహాన్ని శుభ్రం చేస్తారు. పూజల అనంతరం ఆ విగ్రహాన్ని వసంత మంటపంలో ఉంచుతారు.ఇక్కడ స్వామివారు 48 రోజుల పాటు దర్శనమిస్తారు. 24 రోజుల పాటు స్వామి వారు పవళించిన స్థితిలో, మరో 24 రోజులు నిలుచున్నట్లు ఉంటారు స్వామి. 48 రోజుల తరువాత స్వామి వారి విగ్రహాన్ని తిరిగి వెండి పెట్టెలో పెట్టి పుష్కరిణిలోని నాలుగు కాళ్ల మంటపంలో ఉంచి నీటితో నింపేస్తారు. విశేషమేంటంటే అత్తివరదర్ వసంత మంటపం నుంచి భక్తులకు దర్శనమిచ్చేటప్పుడు ఎలాంటి అర్చనలు, అభిషేకాలు, ఇతర పూజా కార్యక్రమాలు ఉండవు. స్వామివారి జలావాసంపై రకరకాల కథనాలు ఉన్నాయి. పూర్వం యుద్ధం జరిగే సమయంలో ఆలయాలకు, దేవతా విగ్రహాలకు తగిన రక్షణ ఉండేది కాదు. ఆలయంలోని మూల విరాట్టును రక్షించుకోవాలనే ఉద్దేశంతో అర్చకులు ఇలా భూమిలో దాచారని, ఆపద సమయం ముగిసిన తర్వాత ఆ విగ్రహాన్ని బయటకుతీసి పూజించారని చెబుతారు. అత్తి వరదర్ను భూమిలోపల దాచే సమయంలో ఏర్పడ్డ గుంత పుష్కరిణిగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది. పురాణాలు మాత్రం యాగ గుండం నుంచి అత్తివరదర్ పుట్టినట్లు చెబుతున్నాయి.
చివరిగా అత్తివరదర్‌ను 1979లో అనంత సరస్సును నుంచి బయటకు తీసుకొచ్చారు. తిరిగి స్వామిదర్శనం 2059లో జరుగుతుంది.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
