
తాజా వార్తలు
తీర్పు వెలువరించిన తమిళనాడు ప్రత్యేక కోర్టు
చెన్నై: ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైగోకు దేహద్రోహం కేసులో ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తమిళనాడు ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. 2008లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో 2009లో అప్పటి డీఎంకే ప్రభుత్వం ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టింది. దీంతో వైగోపై సెక్షన్ 124(ఎ) (దేశద్రోహం) సెక్షన్ 153 (మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష తదితర అంశాలతో ఇరు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈయనే స్వయంగా ఓసారి కోర్టులో లొంగిపోయారు. బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడానికి నిరాకరించారు. తర్వాత ఆయనను పోలీసులు కస్టడీలో ఉంచారు. ఇప్పటికే ఈ కేసు మీద పలు మార్లు విచారణ జరిగింది. దీంతో శుక్రవారం తీర్పు వెల్లడైంది.
రాజా అన్నామలై మండ్రంలో 2008 అక్టోబర్ 21న ఏర్పాటైన సదస్సులో శ్రీలంక తమిళ ఈలం గురించి వైగో ప్రసంగించారు. ఆ ప్రసంగంలో శ్రీలంక తమిళ తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈకి మద్ధతుగా చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశసౌర్వ భౌమత్వాన్ని కించపరిచే విధంగా ఉన్నాయంటూ క్యూబ్రాంచ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- పథకం ప్రకారమే బూటకపు ఎన్కౌంటర్
- వాంఖడేలో రికార్డుల మోత!
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఎన్‌కౌంటర్‌పై సుప్రీం విచారణ కమిషన్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
