close

తాజా వార్తలు

టీఆర్టీ నియామకాల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే..

హైదరాబాద్‌: టీఆర్టీ నియామక ప్రక్రియలో మరో కీలక అడుగు పడింది. ఈ నెల 20వరకు నియామక ప్రక్రియ పూర్తయ్యేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎస్టీజీ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే ఉన్నందున.. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, భాష పండితుల నియామక ప్రక్రియను ఈ నెల 10 నుంచి 20వరకు చేపట్టనునున్నారు. ఈ నెల 10న ఎంపికైన అభ్యర్థులు, ఖాళీల వివరాలతో పాటు.. కౌన్సెలింగ్ జరిగే ప్రాంతాన్ని డీఈవోలు ప్రకటిస్తారు. ఈ నెల 11న జిల్లా స్థాయి కమిటీలు సమావేశమై ఖాళీలను ఖరారు చేసి నోటీసు బోర్డులో ఉంచుతారు. అదేరోజు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 13, 14 తేదీల్లో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. నియామక ఉత్తర్వులు, పోస్టింగ్ ఇస్తారు. ఉద్యోగం పొందిన ఉపాధ్యాయలు ఈ నెల 15న పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఈ నెల 17న కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు.. ఉద్యోగంలో చేరని అభ్యర్థుల వివరాలను డీఈవోలు గుర్తిస్తారు. ఈ నెల 18న కౌన్సెలింగ్‌కు హాజరు కాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా నియామక ఉత్తర్వులు పంపిస్తారు. ఈ నెల 19న ఉద్యోగాల్లో చేరిన వారి వివరాలను ప్రధానోపాధ్యాయులు డీఈవోలకు నివేదిస్తారు. పోస్టింగుల వివరాలను బోర్డుతో పాటు జిల్లా వెబ్‌సైట్‌లో అదే రోజున వెల్లడిస్తారు. ఈ నెల 20న ఉద్యోగంలో చేరని అభ్యర్థుల వివరాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సమాచారం ఇస్తారు. అనంతరం జిల్లాల వారీగా నివేదికలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు నివేదిస్తారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.