close

తాజా వార్తలు

రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్‌ నిలబడదు

భాజపా నేత వాసుదేవ్ దేవనాని

జైపూర్‌: ప్రస్తుతం కర్ణాటక, గోవాల్లో కాంగ్రెస్‌ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. దీంతోపాటు రాజస్థాన్‌లోనూ కాంగ్రెస్‌ నిలబడదంటూ భాజపా నేత వాసుదేవ్‌ దేవనాని వ్యాఖ్యానించారు. ఇక్కడి ప్రభుత్వ పాలన కూడా చివరి అంకానికి చేరుకుందన్నారు.  మీడియాతో మాట్లాడుతూ..‘రాహుల్‌ గాంధీ రాజీనామా తర్వాత కాంగ్రెస్‌ పార్టీ రూపే మారిపోయింది. వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌ కూడా అభద్రతా భావంతో ఉన్నారు. ప్రజలందరూ అశోక్‌నే సీఎంగా చూడాలనుకుంటే..సార్వత్రిక ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలోనే ఆయన కుమారుడు ఎందుకు ఓడిపోయారు?’ అని ప్రశ్నించారు.

మరో భాజపా ఎమ్మెల్యే అశోక్‌ లాహోతీ మాట్లాడుతూ.. ‘జులై 10న గహ్లోత్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అదే ఆయనకు చివరి బడ్జెట్‌. కాంగ్రెస్‌కు ఇక ఇక్కడ కాలం చెల్లబోతోంది. పార్టీలో ఆయనకు సానుకూలత లేదు. రెండు నెలలుగా రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో లుకలుకలు ఏర్పడ్డాయి’ అని వ్యాఖ్యానించారు.

సార్వత్రిక ఎన్నికల్లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ ప్రస్తుతం కొత్తసారథి వేటలో ఉంది. రాహుల్‌ గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడమే ప్రస్తుత పార్టీ ప్రతిష్టంభనకు కారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పడిపోతుందనడం భాజపా భయానికి సూచిక అన్నారు. ప్రభుత్వం పడిపోతుందని భాజపా కలలు కంటోందని చురకలంటించింది.
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.