close

తాజా వార్తలు

అనుమానం.. ఆయువు తీసింది

వేమయ్య మృతదేహం

చందవరం (నాదెండ్ల), న్యూస్‌టుడే : నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన వారి జీవనంలో అనుమానం పెనుభూతమైంది. కట్టుకొన్న భార్యతో కడవరకు వెంట నడవాల్సిన అతను మధ్యలోనే ఆయువు తీసుకున్నాడు. జీవిత భాగస్వామిపై నమ్మకం కోల్పోయిన భర్త ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకొన్న సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చందవరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసరావుపేట మండలం కేసానుపల్లికి చెందిన దుగ్గి వేమయ్య (37)కు నాదెండ్ల మండలం చందవరానికి చెందిన లతతో పదిహేనేళ్ల క్రితం వివాహమైంది. రెక్కల కష్టంతో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. కుటుంబ కలహాల కారణంగా చందవరం వచ్చి వేరు కాపురం పెట్టారు. భార్య ప్రవర్తనపై అతనికి అనుమానం తలెత్తి.. తరచూ గొడవ పడుతుండువాడు. ఈ నేపథ్యంలో శనివారం నరసరావుపేటలో పనులు ముగించుకొని ఇంటికొచ్చాడు. భార్య కనిపించక పోవడంతో గాలించాడు. ఆమె ఇదే ఊరిలో పుట్టింటికి వెళ్లింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన అతను చీరతో ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విగతజీవిగా వేలాడుతున్న తండ్రి చూసి పిల్లలు కేకలేశారు. మృతదేహాన్ని కేసానుపల్లి తీసుకెళ్ళారు. అయితే అతని అన్న దుగ్గి వెంకట సుబ్బయ్య ఈ సంఘటనపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు వైద్య పరీక్షలకు మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెన్నకేశవులు ఆదివారం తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.