close

తాజా వార్తలు

బిందెలతో దాడి.. మహిళ మృతి

సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని స్థానిక పల్లివీధిలో మంచినీటి కుళాయివద్ద జరిగిన ఘర్షణలో ఓ మహిళ మృతి చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాటిపూడి పద్మ(38) మంచినీటిని పట్టుకునేందుకు కుళాయివద్ద క్యూలో నిల్చున్నారు. ఈ నేపథ్యంలో మహిళలు వరుస తప్పడంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ తగాదాలో మహిళలు బిందెలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పద్మ గుండె, తల భాగంలో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారమందుకున్న సోంపేట ఎస్సై కె.వెంకటేశ్‌ సంఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.