close

తాజా వార్తలు

చాటుగా చరవాణిలోమాట్లాడిందని..

తలుపుల(అనంతపురం): చాటుగా చరవాణిలో మాట్లాడిందన్న అనుమానంతో భార్యపై భర్త కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన పెద్దన్నవారిపల్లి పంచాయతీ సంఘటివారిపల్లిలో గురువారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. స్వాతి, రమణయ్య భార్యాభర్తలు. వీరి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగేది. స్వాతి వరుసకు సోదరుడైన వ్యక్తితో చాటుగా చరవాణిలో మాట్లాడిందని, ఆ తర్వాత మాట్లాడలేదని అబద్ధం చెప్పిందన్న కోపంతో భార్యాభర్తల మధ్య చిచ్చు మొదలైంది. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో భర్త రమణయ్య కొడవలితో దాడి చేయడంతో ఆమె కుడిచేతికి గాయమైంది. బాధితురాలిని బంధువులు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.