close

తాజా వార్తలు

స్కూల్‌ లీడర్‌గా ఓడి.. విద్యార్థి సూసైడ్‌!

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చరణ్‌ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 16న రామన్న పేటలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తరగతి లీడర్‌ కోసం పోటీలు నిర్వహించారు. లీడర్‌గా పోటీచేసిన చరణ్‌ ఓటమిపాలయ్యాడు. దీంతో  మనస్తాపానికి గురై ఇంటినుంచి వెళ్లిపోయిన బాలుడు రైలు పట్టాలపై విగతజీవిగా కన్పించాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమారుడి మృతితో ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.