close

తాజా వార్తలు

భార్య, అత్తను కత్తితో నరికి చంపిన అల్లుడు

గోపాలపురం: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. భార్య, అత్తను ఓ వ్యక్తి కత్తితో నరికాడు. ఈ ఘటన గోపాలపురం మండలంలోని దొండపూడిలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కాంతారావు అనే వ్యక్తి భార్య పుష్పలత, అత్త లక్ష్మితో పాటు అడ్డొచ్చిన బావ మరిది మంగారావుపైనా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పుష్పలత, లక్ష్మి మృతిచెందగా, బావ మరిది మంగారావు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న స్థానికులు కాంతారావును నిర్భందించినట్లు సమాచారం. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.