close

తాజా వార్తలు

ఐఎమ్‌ఏ కుంభకోణం ప్రధాన నిందితుడి అరెస్ట్‌

దిల్లీ: ఐఎమ్‌ఏ అనినీతి కుంభకోణంలో ప్రధాన నిందితుడు మహ్మద్‌ మన్సూర్ ఖాన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అదుపులోకి తీసుకుంది. దుబాయ్‌ నుంచి వచ్చిన అతడిని అధికారులు శుక్రవారం వేకువజామున 1:30 గంటలకు అరెస్టు చేశారు. అతడిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసిన ఈడీ విచారణకు భారత్‌కు తిరిగి వచ్చి విచారణకు సహకరించాలని ఇటీవల కోరింది. ఈ మేరకు ఆయన గత సోమవారం ఓ వీడియో సందేశాన్ని విడుల చేశారు. దేశాన్ని వదిలి తప్పు చేశానని వీడియోలో అంగీకరించిన మన్సూర్‌ 24 గంటల్లో తిరిగి వస్తానని హామీ ఇచ్చాడు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరాడు. భారత న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని.. తప్పని పరిస్థితుల్లోనే దుబాయ్‌కి వెళ్లాల్సి వచ్చిందని వివరించాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండ్‌ అయిన కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్‌ బేగ్‌ను సిట్‌ అధికారులు మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే.

అధిక వడ్డీలు ఇస్తామంటూ ఐఎమ్‌ఏ కంపెనీ పేరిట మన్సూర్‌ఖాన్‌ ప్రజల నుంచి భారీ ఎత్తున డబ్బులు సేకరించాడు. అతడిని నమ్మి ప్రజలు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు డిపాజిట్‌ చేసినట్లు అధికారులు అప్పట్లో వెల్లడించారు. కొంత కాలం గడిచిన తర్వాత వడ్డీలు ఇవ్వకపోవడంతో దాదాపు 50వేల మంది డిపాజిటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేయడంతో మన్సూర్‌ దుబాయ్‌కి మకాం మార్చాడు. అక్కడికి చేరిన తర్వాత జూన్‌ 23న ఓ వీడియో విడుదల చేసిన అతడు.. ప్రభుత్వంలో చాలా మందితో తనకు సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశాడు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోషన్ బేగ్‌కు రూ.400కోట్లు ఇచ్చానని చెప్పాడు. మంత్రి జమీర్‌ అహ్మద్‌తోనూ సత్సంబంధాలు ఉన్నాయన్నాడు. దీంతో అక్రమ నగదు చలామణీ కింద జూన్‌ 24న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ కేసు నమోదు చేసింది. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో మన్సూర్‌ఖాన్‌ అరెస్టుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.