close

తాజా వార్తలు

నల్గొండలోఘోరం..తల నరికి పోలీస్టేషన్‌కు!

నాంపల్లి (నల్గొండ): నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో దారుణం జరిగింది. శనివారం సాయంత్రం ఓ యువకుడు (28) దారుణహత్యకు గురైన  ఘటన నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన ఎండీ ఇర్ఫాన్‌, నాంపల్లి మండల కేంద్రానికి చెందిన ఎండీ గౌస్‌కు సోదరి వరుసైన ఓ మహిళ ఉండేది. ఆ మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ తర్వాత నాంపల్లి మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన సద్దాం అనే ఆటో డ్రైవర్‌ ఆమెను హైదరాబాద్‌ తీసుకెళ్లాడు. కొంతకాలం ఇద్దరూ సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే మహిళ 2017లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో తమకు సోదరి వరుసైన మహిళను సద్దాం హత్య చేశాడనే నెపంతో అతనిపై ఇర్ఫాన్‌, గౌస్‌లు కోపం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో కొబ్బరి బొండాల కత్తితో ఇర్ఫాన్‌, గౌస్‌ ఇద్దరూ సద్దాం తల నరికారు. ఆ తలతో పాటు నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. కేసు నమోదు చేసిన నాంపల్లి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.