
తాజా వార్తలు
దిల్లీ: గత సంవత్సరం ఫ్రాన్స్‌లో జరిగిన యాంజియోప్లాస్టీ తరవాత కోలుకున్న షీలా దీక్షిత్ ఆరోగ్యంగా ఉన్నారని.. హఠాత్తుగా ఆదివారం గుండెపోటు రావడం విస్మయానికి గురిచేసిందని వైద్యుడు అశోక్ సేథ్ అభిప్రాయపడ్డారు. గత కొంత కాలంగా ఆమెని హృద్రోగ సమస్యలు బాధిస్తున్నప్పటికీ.. కొన్ని శస్త్ర చికిత్సల తరవాత బాగా కోలుకున్నారని.. ఈ మధ్య ఆమె ఆరోగ్యం బాగా మెరుగుపడిందని ఆయన తెలిపారు. ‘‘గతంలో ఆమెకు కొన్ని సమ్యలు ఉన్నప్పటికీ ఈ మధ్య మాత్రం చాలా ఆరోగ్యంగా ఉన్నారు. అందుకే అకస్మాత్తుగా వచ్చిన గుండెపోటు మమ్మల్ని విస్మయానికి గురిచేసింది. 18 సంవత్సరాల నుంచి నేను ఆమెకు వైద్యం చేస్తున్నాను. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న స్థితిలో ఆదివారం ఉదయం 10.40గంటలకు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య సేవలకు స్పందించిన ఆమె ఆరోగ్యం కొద్ది సమయంలోనే బాగా మెరుగుపడింది. నాడీ, శ్వాస అన్నీ సాధారణ స్థితికి వచ్చాయి. కానీ మధ్యాహ్న 3గంటల నుంచి మళ్లీ ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. మరోసారి గుండెపోటు రావడంతో ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. ఆమెను కోల్పోవడం వ్యక్తిగతంగా నన్ను ఎంతో కలచివేస్తోంది’’ అని సేథ్ తన అనుభవాల్ని పంచుకున్నారు.
సుదీర్ఘకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న షీలా.. 2001లో ఒపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. 2006, 2012లో సేథ్ ఆధ్వర్యంలోని వైద్య బృందం యాంజియోప్లాస్టీ చేశారు. అలాగే శ్వాసకోస ఇబ్బందులతో బాధపడ్డ ఆమెకు 2013లో సైనస్ శస్త్రచికిత్స సైతం జరిగింది. శనివారం 3.55గంటలకు కన్నుమూసిన షీలా అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 2.30గంటలకు నిగమ్ బోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాని సహా పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
