close

తాజా వార్తలు

భాజపా ఫ్లెక్సీ దగ్ధం..వ్యక్తికి దేహశుద్ధి

హైదరాబాద్‌: బోనాల పండగ సందర్భంగా భాజపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ధ్వంసం చేసేందుకు ఓ ఆకతాయి చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసింది. వివరాల్లోకి వెళ్తే.. బోనాల సందర్భంగా హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్‌లో భాజపా నాయకుల చిత్రపటాలతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆ ఫ్లెక్సీని కాల్చివేశాడు. ఇది గమనించిన స్థానిక భాజపా కార్యకర్తలు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.