close

తాజా వార్తలు

అన్నం వండలేదని.. భార్య కాళ్లు చేతులు కోశాడు!

చిట్టినగర్‌, (విజయవాడ), న్యూస్‌టుడే: ఇంటి ఖర్చులకు డబ్బులు ఇవ్వకుండా..నిత్యవసర సరకులు తెచ్చివ్వకుండా..భార్య అన్నం వండలేదని భర్త ఆమె చేతులు, కాళ్లు కోసిన సంఘటన ఆదివారం వెలుగుచూసింది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నపురెడ్డి జగదీష్‌రెడ్డి- హాసిని దంపతులు గొల్లపాలెంగట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారికి వివాహమై ఏడు సంవత్సరాలైంది. ఇద్దరు సంతానం ఉన్నారు. భర్త ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ పోషణకు సక్రమంగా డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యా  భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి 12.30 గంటలకు భర్త ఇంటికి వచ్చి అన్నం పెట్టమన్నాడు. బియ్యం లేక వండ లేదని భార్య చెప్పింది. దీనితో ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ భార్యను చాకుతో చేతుల మీద, కాళ్లపై కోశాడు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.