close

తాజా వార్తలు

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని..

‘ఫేస్‌బుక్‌’ సాక్షిగా  యువకుడి అత్మహత్య

అగ్రా (ఉత్తర్‌ప్రదేశ్‌) : తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్వక్తితో పెళ్లవుతుందనే బాధలో ఓ యువకుడు అత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  వివరాల్లోకి వెళితే అగ్రా సమీపంలోని రైబా గ్రామానికి చెందిన శ్యామ్‌శికర్వర్‌(22) శనివారంనాడు స్థానికంగా ఉండే ఆలయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా దానిని ఫేస్‌బుక్‌లో లైవ్‌ ప్రదర్శన చేయడం గమనార్హం. ఆ దృశ్యాన్ని అతడి స్నేహతులలో కొందరు  వీక్షించారు.  అలాగే నాలుగు పేజీల ఆత్మహత్యా లేఖను కూడా ఆ ప్రదేశంలో ఉంచాడు. అందులో తన కుటుంబసభ్యులకు క్షమాపణలు తెలిపాడు. మొత్తం నాలుగు నిమిషాల నిడివి గల ఈ వీడియోలో తన ఆత్మహత్యకు సంబంధించి ఎవరి మీద చర్యలు తీసుకోవద్దని అతడు కోరినట్లు పోలీసులు పేర్కొన్నారు. తన మృతదేహం చిత్రాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయాల్సిందిగా తల్లిదండ్రులను కోరాడు. అయితే అతని తల్లిదండ్రులు మాత్రం ఫేస్‌బుక్‌ నుంచి అతని ఖాతాను ఈ ఘటన తర్వాత తొలగించారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ..ప్రేమించిన యువతి దక్కకపోవటం, ఉద్యోగం లేకపోవటంతో ఒత్తిడి గురై అతడు అత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.