close

తాజా వార్తలు

ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం

ముంబయి: ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎంటీఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ కార్యాలయ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. 9 అంతస్తులున్న ఈ భవనంలో 3, 4 అంతస్తుల్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. సుమారు 100 మందికి పైగా కార్యాలయ సిబ్బంది భవనం డాబాపై చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 14 అగ్నిమాపక వాహనాలు ప్రస్తుతం ఘటనా స్థలిలో మంటలార్పుతున్నాయి. డాబాపై చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఓ క్రేన్‌ను రప్పించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ప్రమాదానికి ముందు వైర్లు కాలిన వాసన వచ్చినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ప్రమాదానికి గల అసలు కారణమేంటన్నది తెలియరాలేదు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.