close

తాజా వార్తలు

జమ్మలమడుగులో  54 నాటు బాంబులు

భూమిని చదును చేస్తుండగా బహిర్గతం
ఇటీవల సీఎంకు హెలిప్యాడ్‌ ఏర్పాటు చేసిన చోటుకు కొద్ది దూరంలోనే గుర్తింపు

జమ్మలమడుగు, న్యూస్‌టుడే: కడప జిల్లా జమ్మలమడుగులో పెద్దఎత్తున నాటు బాంబులు బయటపడ్డాయి. జమ్మలమడుగు-ముద్దనూరు రహదారి పెన్నానది సమీపంలో ప్లాట్లు వేసేందుకు భూమిని పొక్లెయిన్‌తో చదును చేసే పనులు పది రోజులుగా జరుగుతున్నాయి. మంగళవారం కంపచెట్లను తొలగిస్తుండగా ఓ స్టీల్‌ బక్కెట్‌ బయటపడింది. జమ్మలమడుగు డీఎస్పీ కె.కృష్ణన్‌, పట్టణ, గ్రామీణ సీఐలు శ్రీనివాసులు, మంజునాథరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ స్టీల్‌ బక్కెట్‌లో పది నాటు బాంబులు గుర్తించారు. మరికొద్ది దూరంలో ప్లాస్టిక్‌ బక్కెట్‌ బయటపడింది. ఇంకా ఏమైనా ఉండొచ్చన్న అనుమానంతో సమీప ప్రాంతమంతా తవ్వకాలు జరపగా మరో రెండు ప్లాస్టిక్‌ బక్కెట్లు బయటపడ్డాయి. నాలుగు బక్కెట్లలో 54 నాటు బాంబులున్నట్లు తేల్చారు. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జమ్మలమడుగులో  రైతు దినోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు సుమారు 30 మీటర్ల దూరంలోనే ప్రస్తుతం ఈ బాంబులు దొరకడం గమనార్హం. ఎవరు పాతిపెట్టి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ కోలార్‌ కృష్ణన్‌ తెలిపారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.