close

తాజా వార్తలు

చాక్లెట్‌ ఇస్తానని చిన్నారిపై అత్యాచారం

ఆదిలాబాద్‌ గ్రామీణం: చాక్లెట్‌ ఇస్తానని మాయమాటలు చెప్పి నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్‌ గ్రామీణ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలికను తల్లిదండ్రులు ఇంట్లో నానమ్మ వద్ద వదిలి వ్యవసాయ పనులకు వెళ్లారు. ఆ సమయంలో చాట్ల విజయేందర్‌ అనే 25 ఏళ్ల యువకుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్‌ ఇస్తానని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విజయేందర్‌ భార్య పుట్టింటికి వెళ్లగా.. ఆ సమయంలో తల్లిదండ్రులు వేరే గదిలో ఉన్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు ఆ బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో తల్లిదండ్రులతో పాటు గ్రామస్థులు ఆ కామాంధుడికి దేహశుద్ధి చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్‌ఐ హరిబాబు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చిన్నారికి వైద్య పరీక్షలు జరిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.