close

తాజా వార్తలు

బీఏ పూర్తయితే ఏ అవకాశాలు?

* బీఏ (హెచ్‌ఈపీ) చదివినవారికి ఉన్న కెరియర్‌ అవకాశాలేమిటి? లైఫ్‌ సైన్సెస్‌తో పోలిస్తే బీఏ వారికి అవకాశాలు తక్కువని విన్నాను. నిజమేనా?

- లావణ్య

 
 
 
 
 

ఉద్యోగావకాశాలు సాధారణంగా దేనిలోనైనా సమానంగానే ఉంటాయి. అయితే ఎక్కువమంది విద్యార్థులు సైన్స్‌ విభాగంలో కోర్సులు చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి అక్కడ బోధన అవకాశాలు ఎక్కువ. మీరు పీజీలో హిస్టరీ/ఎకనామిక్స్‌/పొలిటికల్‌ సైన్స్‌ చేయవచ్చు. జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకులుగా చేరడానికి ఇది దోహదపడుతుంది. నెట్‌ లో అర్హత సాధిస్తే డిగ్రీ కళాశాలల్లో కూడా అధ్యాపకులుగా చేరటానికి వీలుంటుంది. ఎకనామిక్స్‌ విభాగంలో బ్యాంకింగ్‌ లాంటి రంగాల్లో అనేక అవకాశాలున్నాయి. ఏ రంగంలో అయినా చేసేదాన్ని ఇష్టపడి చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది. దేశంలో అత్యధికులు పోటీపడే సివిల్‌ సర్వీస్‌ పరీక్షకు కూడా అర్హత డిగ్రీనే. ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు డిగ్రీ అర్హతగా ఉంటోంది.

రెండో ఏడాది నుంచి కొనసాగించవచ్చా?

* డిగ్రీ మొదటి ఏడాది తర్వాత డీఈడీ చేశాను. ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలనుకుంటున్నాను. రెండో సంవత్సరం నుంచి చదవడం కుదురుతుందా?

- జి.అరుణ్‌కుమార్

 
మీరు నిరభ్యంతరంగా మీ డిగ్రీని కొనసాగించవచ్చు. ఒకవేళ మీరు డీఈడీతో టీచర్‌ ఉద్యోగం చేయాలనుకుంటే, కొన్ని విశ్వవిద్యాలయాల్లో దూరవిద్య ద్వారా మీ డిగ్రీని కొనసాగించి పూర్తిచేసుకోవచ్చు.

Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.