
తాజా వార్తలు
నల్లకుంట: హైదరాబాద్లో జరిగిన బోనాల ఉత్సవాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధి విద్యానగర్ టీఆర్టీ కాలనీలో ఆదివారం బోనాల ఉత్సవాలు జరిగాయి. అయితే ఉత్సవాల్లో భాగంగా భక్తులు ఫలహారాల బండి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో విధులు నిర్వహిస్తున్న నల్లకుంట ఎస్సై మహేందర్ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ ఆలస్యమవుతోంది.. త్వరగా కార్యక్రమాన్ని ముగించాలని సూచిస్తూ ముందుకెళ్తుండగా అక్కడే నృత్యం చేస్తున్న ఓ ఆకతాయి ఎస్సైను ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఎస్సై అతడి చెంప చెళ్లుమనిపించారు. ఈ సన్నివేశాన్ని గమనించినవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. విధులకు ఆటంకం కలిగించాడనే నేరం కింద పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Tags :
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
