
తాజా వార్తలు
ఏలూరు నేర వార్తలు: పశ్చిమగోదావరి ఏలూరులో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఏలూరు శివారులోని ఆస్రం మెడికల్ కళాశాలలో సోమవారం సాయంత్రం జరిగింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన జి.పుష్పం నాయక్ (23) అనే విద్యార్థి ఏలూరు ఆస్రం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే సోమవారం రెండో సంవత్సర ఆఖరి పరీక్ష రాసి వసతి గృహంలోని తన గదికి వెళ్లాడు. ఈ క్రమంలోనే సాయంత్రం దుప్పటితో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు పుష్పం నాయక్‌ను కిందకు దించి సమీపంలోని ఆస్రం ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు విద్యార్థి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ దిలీప్ కిరణ్, ఏలూరు రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలేంటనే దానిపై ఆరా తీస్తున్నారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
